విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సోమవారం నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి మీడియాతో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ స్క్రిప్ట్‌ను సంజీవ్ బాగా హ్యాండిల్ చేశారు. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది. ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూతో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. మన సొసైటీలో ఉన్న ఈ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడుకోవాలి.
ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో ‘సంతాన ప్రాప్తిరస్తు 2′ చేయాలనుకుంటున్నాం. దాదాపు 300 థియేటర్స్‌లో రిలీజ్ అవుతోందంటే ట్రైలర్ ఆకట్టుకోవడం వల్లే. డిజిటల్ బిజినెస్ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం. అన్ని ఏరియాల్లో మెయిన్ థియేటర్స్ దొరికాయి. యూఎస్‌లో దాదాపు 200 లొకేషన్స్‌లో పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. మా ట్రైలర్ నచ్చి ఆయన రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో నిర్మాతగా మీ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. నేను ఐటీ సెక్టార్ నుంచి వచ్చాను. ఇది ఐటీ ఎంప్లాయ్ నేపథ్యంగా ఉంటుంది. కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా బాగా రిలేట్ అవుతున్నారు. ట్రైలర్ వాళ్లకు బాగా నచ్చింది. మేల్ ఫెర్టిలిటీ ఇష్యూతో ఈ సినిమాలో ఎక్కడా అసభ్యత లేకుండా, ఎవర్నీ విమర్శించకుండా, హద్దులు దాటకుండా, బలమైన కథతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిర్మించాం’ అని నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి చెప్పారు.
అలాంటి వారికి ధైర్యం ఇచ్చే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



