Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్షకులకు కల్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా

ప్రేక్షకులకు కల్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా

- Advertisement -

కృష్ణ బురుగుల, ధీరజ్‌ ఆత్రేయ, మణి వక్కా, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో మౌంట్‌ మెరు పిక్చర్స్‌ నిర్మించిన చిత్రం ‘జిగ్రీస్‌’. హరిష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ నెల 14న వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ కానుంది. దర్శకుడు హరీష్‌ రెడ్డి ఉప్పుల మాట్లాడుతూ, ‘ఇది యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌. ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. ఒక కొత్త ఫీల్‌ ఇవ్వడం కోసం చాలా కేర్‌ తీసుకున్నాం. ప్రేక్షకులు కచ్చితంగా అన్ని క్యారెక్టర్స్‌తో రిలేట్‌ అవుతారు. ప్రతి సీన్‌లో హిలేరియస్‌గా నవ్వుకుంటారు. ప్రొడ్యూసర్స్‌ చాలా సపోర్ట్‌ చేశారు.

మీ ఫ్యామిలీతో సినిమాకి రండి. ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు. ‘లొకేషన్స్‌, సీన్స్‌.. అన్నీ ఒక కల్ట్‌ సినిమాగా ఉండబోతుంది. సినిమా ఎంత హిలేరియస్‌గా ఉంటుందో, అంత ఎమోషనల్‌గా ఉంటుంది’ అని నిర్మాత కృష్ణ వోడపల్లి చెప్పారు. సహ నిర్మాత చిట్టెం వినయ్ మాట్లాడుతూ,’నటీనటుల నటన, సాంకేతిక నిపుణల పనితనం ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ ఇస్తుంది. ఈ యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌ తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -