హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన, దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
డాన్స్ కొరియోగ్రాఫర్‌గా పేరొందిన రామ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సినిమాకి వస్తున్న మంచి రెస్పాన్స్ నేపథ్యంలో హీరో రామ్‌కిరణ్ మీడియాతో ముచ్చటించారు. నాకు చిన్నప్పటినుండి డాన్స్ అంటే ఎంతో ఇష్టం. కొరియోగ్రాఫర్‌గా దేశంలోని ఎన్నో చిత్ర పరిశ్రమల్లో పనిచేశాను. నాకు హీరో అంటే చాలా ఇష్టం. అందుకే నటనపై ఉన్న మక్కువతో నటుడిగా మారాను. నాకు నటనపై ఉన్న ఇష్టం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి.
తద్వారా ఈ చిత్ర దర్శకుడు ఉదయ్ శర్మ పరిచయమయ్యారు. ఈ చిత్ర కథ, చిత్రంలోని హీరో పాత్ర నచ్చడంతో ఇందులో నటించాను. ఈ సినిమాలో నా పాత్ర ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన హీరో పాత్రలా కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. కొంచెం సైకాలజీకి సంబంధించిన పాత్ర కావడంతో ప్రేక్షకులకు నా పాత్ర పై ఉత్కంఠ ఏర్పడింది. నా పాత్ర ఎంతో బాగుందని అందరూ ప్రశంసిస్తున్నారు. దర్శకుడు ఉదయ్ శర్మ కథ విషయంలో చాలా పర్టిక్యూలర్‌గా ఉన్నారు. హెచ్ ఎన్ జి నిర్మాణ సంస్థ వారికి సినిమాల కాకుండా ప్రతి విషయంలోనూ వారు ముందుండి సినిమాను ముందుకు తీసుకువెళ్లారు. ప్రీమియర్స్ నుంచే మాకు అద్భుతమైన స్పందన లభించింది. కుటుంబ సమేతంగా పిల్లలతో కలిసి చూడొచ్చని, కుటుంబ విలువలు పెంచే చిత్రం అని వారు ప్రశంసించారు.
కుటుంబ విలువలు పెంచే చిత్రం
- Advertisement -
- Advertisement -



