Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమెగా రైడ్‌లా ఉండే సినిమా

మెగా రైడ్‌లా ఉండే సినిమా

- Advertisement -

చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కలయికలో రూపొందిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’. సంక్రాంతి ఉత్సాహాన్ని మరింత పెంచుతూ వెంకటేష్‌ కీలక పాత్రతో నటిస్తున్నారు.
ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి. మేకర్స్‌ తిరుపతిలో సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ,’చిరంజీవిని నేను ఎలా చూపించాలి అనుకుంటున్నానో, ఆయన నాకు ఎలా ఇష్టమో, ఆయనలో నాకు ఏం నచ్చుతాయి అనే ఆలోచనతో ఈ కథని రాసుకున్నాను. దానికి తగ్గ అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ ట్రైలర్‌లో చూసింది జస్ట్‌ గ్లింప్స్‌ మాత్రమే. సినిమా చూసిన తర్వాత ఒక టైం మిషన్‌ ఎక్కి ఒక రౌండ్‌ వేసి వస్తారు.

అది మాత్రం గ్యారెంటీ. చిరంజీవి ‘లీడర్‌ రాజు, ఆటో జానీ.. ‘ఇలాంటి క్యారెక్టర్స్‌లో ఆయన మనకు విపరీతంగా నచ్చుతారు. నేను ఆ అలాంటి బేసిస్‌లోనే ఈ శంకర వరప్రసాద్‌ క్యారెక్టర్‌ రాసుకోవడం జరిగింది. చిరంజీవి గారిలో ఉన్న ఫన్‌ టైమింగ్‌ నేచురల్‌ ఎక్స్ప్రెషన్స్‌ ఈ సినిమాలో అద్భుతంగా ఎక్స్‌ఫ్లోర్‌ చేశాం. నేను రాసిన దాని కంటే చిరంజీవి దాన్ని వంద రెట్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ప్రజెంట్‌ చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్‌లో స్పెషల్‌ ఫిలిం. ఇది నా నాలుగో సంక్రాంతి సినిమా. తప్పకుండా మళ్ళీ మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -