నరేష్ విజయ్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘శుభకత్ నామ సంవత్సరం’. ఎస్.ఎస్. సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీ పిక్చర్స్, అవిష్క డ్రీ ప్రొడక్షన్ బ్యానర్స్ పై డిఆర్ విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా నరేష్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ,’ఈ కథ నాకు చాలా నచ్చింది. అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా. ఇది డ్రామా, సస్పెన్స్, ట్రావెల్ అన్ని అద్భుతంగా ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉన్న సినిమా. తెలుగు, కన్నడలో చాలా మంచి స్టార్ కాస్ట్‌తో వస్తున్న సినిమా ఇది. అద్భుతమైన విజయం సాధించే అన్ని అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి’ అని తెలిపారు. ‘నరేష్ చేస్తున్న ప్రతి రోల్ చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ఇస్తున్నారు. కొత్త డైరెక్టర్స్‌ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన సినిమాలో ఉంటే చాలు అనే ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు.
ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు పరిశ్రమంలో ఉండడం చాలా గర్విస్తున్నాను’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు. డైరెక్టర్ సజ్జన్ మాట్లాడుతూ,’నరేష్ గోల్డెన్ ఇయర్ సినిమా చేయడం నా అదృష్టం. నేను ఇప్పటివరకూ నాలుగు సినిమాకు చేశాను. లాస్ట్ ఫిలింకి కర్ణాటక బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నరేష్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. మీ అందరినీ కచ్చితంగా అలరించేలా సినిమా ఇది’ అని తెలిపారు. నిర్మాత విశ్వనాధ్ నాయక్ మాట్లాడుతూ,’నాకు ఈ ఇండిస్టీలో సినిమా చేసే అవకాశం ఇచ్చిన నరేష్‌కి ధన్యవాదాలు. చాలా మంచి కథతో ఈ సినిమా తీస్తున్నాం. నరేష్ చాలా క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా మీ అందరిని అలరించేలా ఉంటుంది’ అని అన్నారు. పవిత్ర లోకేష్, డైరెక్టర్ రామ్ అబ్బరాజు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నిర్మాత రాజేష్ దండా తదితరులు ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



