Thursday, February 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం కొత్తదనం ఉన్న సినిమా

ఆద్యంతం కొత్తదనం ఉన్న సినిమా

- Advertisement -

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. ఈచిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయం అయ్యారు. చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్‌రెడ్డి సహ నిర్మాతగా దీన్ని నిర్మించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విశేష ఆదరణతో మంచి విజయం సాధించింది. అలాగే గురువారం నుంచి ఈసినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ,’ఈటీవీ విన్‌ కారణంగా చాలా మంది కొత్త దర్శకులు, కొత్త కంటెంట్‌, కొత్త మేకర్స్‌ వస్తున్నారు. దర్శకుడు వినయ్ వాయిస్‌లోనేకాదు తన సినిమాలోనూ నిజాయితీ ఉంది.

ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఈ సినిమా చూశాక చాలామంది మూవీ మేకర్స్‌ స్ఫూర్తి పొందుతారు’ అని అన్నారు. ‘అందరికీ రీచ్‌ అవ్వలేకపోయిన సినిమా ఇది. ఇంకా చాలామంది థియేటర్లలో చూడలేదు అనేది నా ఫీలింగ్‌. సినిమా చూస్తున్నప్పుడు ఇంత మంచి సినిమా థియేటర్‌లో ఎలా మిస్‌ అయ్యాను అనే ఫీలింగ్‌ కలిగింది. చాలా కొత్తదనంతో ఉన్న సినిమా ఇది. చాలా మంది ఆత్మన్యూనత భావంతో ధైర్యాన్ని కోల్పోతారు. జీవితంలో ఉన్న ఆనందాన్ని, అందాన్ని ఆస్వాదించలేక చాలా మంది చాలా నిస్తేజంగా బతుకుతుంటారు. అలాంటి ఒక మంచి విషయాన్ని చెప్పిన ఈ సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నాను’ అని దర్శకుడు వేణు ఉడుగుల చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -