– 5 నిమిషాల్లోపే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
– తప్పిన పెను ప్రమాదం
నవతెలంగాణ-కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనున్న దూరదర్శన్ కేంద్రంలో మంగళవారం సాయంత్రం 4:25 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. కేవలం ఐదు నిమిషాల్లోపే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఉన్న ఇండ్ల యజమానులు, పక్కనే ఉన్న కట్టెకోత మిషన్ యజమానులు ఆందోళన చెందారు. వెంటనే స్పందించిన కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది అధికారి అబ్దుల్ సలాం, లేడీ ఫైటర్ సాయిబాబా, సిబ్బంది శ్రవణ్ తదితరులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
‘కామారెడ్డి’ దూరదర్శన్ కేంద్రంలో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



