Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామికి సన్మానాల వెల్లువ.!

తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామికి సన్మానాల వెల్లువ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలుపొంది గతంలో ఏనాడు లేనివిధంగా చరిత్ర సృష్టించిన బండి స్వామికి సన్మానాల తాకిడి తలిగింది. ఉదయం మొదలుకొని రాత్రి వరకు అన్ని వర్గాల నాయకులు,ప్రజలు,ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమ కారులు సన్మానాల కోసం క్యూ కట్టారు. గురువారం ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్, దన్నపనేని సురేష్ రావు, బండి రాజయ్య, రణదీర్ రావు, మేనం సతీష్, తూండ్ల రాజయ్య, సబ్బిడి రమణా రెడ్డి, కాటం మదుకర్ రెడ్డి తోపాటు పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. తనపై నమ్మకంతో విజయానికి నాంది పలికిన అన్నివర్గాల ప్రజలకు స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ తుచ తప్పకుండా అమలైయ్యేలా చూస్తానన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -