నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం లొ తహసీల్దార్ దశరథ్,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై అరుణ్ కుమార్ యాదవ్, ఐకెపి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ స్టేషన్, ఎంఈఓ, ప్రభుత్వ పాఠశాలలు, ఆయా సంఘాలు, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. బీజేపీ కార్యాలయం లో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకట కృష్ణ శర్మ, భారాసా కార్యాలయంలో మాజీ ఉప సర్పంచ్ విట్టల్, కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి జాతీయ జెండాను విష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు సౌదాగర్ గంగారం, మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి, సొసైటీ చైర్మన్ చెన్నారెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
రెపరెపలాడిన మువ్వలా జెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES