బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’.
ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్ జంటగా నటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే చిత్ర బందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌లో సందడి చేసింది. దసరా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రెజెంటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ, ‘మేము ‘లిటిల్ హార్ట్స్’తో ఎంతగా అయితే నవ్వించామో ఈ ‘మిత్ర మండలి’తోనూ అంతే స్థాయిలో ఖచ్చితంగా నవ్విస్తాం. సినిమా చూసి మీరు నవ్వి, నవ్వి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు’ అని అన్నారు. ‘మా ‘మిత్ర మండలి’ బృందంతో ఈ ఉత్సవ్‌లో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది.
ఈనెల 16న అందరినీ నవ్వించేందుకు మేం థియేటర్లోకి వస్తున్నాం’ అని నిర్మాత భాను ప్రతాప చెప్పారు. సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఈ మూవీలోని ప్రతీ పాటను శ్రోతలు చార్ట్ బస్టర్‌లుగా మార్చారు. ఈ మూవీతో అందరికీ తప్పకుండా వినోదం లభిస్తుంది. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజారు చేయండి’ అని తెలిపారు. ‘తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని మా పరిశ్రమలోని వ్యక్తులు ఎల్లప్పుడూ చెబుతారు. ఈనెల 16న రానున్న మా సినిమా థియేటర్లలో కుటుంబం మొత్తంతో ఆస్వాదించగల క్లీన్ ఎంటర్‌టైనర్’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం – ఆర్‌ఆర్ ధ్రువన్, సినిమాటోగ్రఫీ – సిద్ధార్థ్ ఎస్జె, ఎడిటింగ్ – పీకే, ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్.
ఆద్యంతం నవ్వించే ‘మిత్ర మండలి’
- Advertisement -
- Advertisement -