మియాపూర్, శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసుల సంయుక్త దాడి
సృష్టి ఐవీఎఫ్ సెంటర్ కేసులో నిందితులు బెయిల్‌పై వచ్చి మళ్లీ అదే దందా
మాదాపూర్ డీసీపీ రితిరాజ్ వివరాలు వెల్లడి
నవతెలంగాణ-మియాపూర్
పిల్లలను విక్రయిస్తున్న ముఠాను మియాపూర్, శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్త దాడి చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా మాదాపూర్ డీసీపీ రితిరాజ్ బుధవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మాదాపూర్ పోలీసులు, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, పిల్లలను విక్రయిస్తున్న 11 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఇద్దరు చిన్నారులను శిశువిహార్ కేంద్రానికి తరలించారు.
నిందితులు హర్షరాయ్, దారం లక్ష్మీ.. అహ్మదాబాద్ నుంచి చిన్నారులను, తెలంగాణలోని సిద్దిపేట్ నుంచి ఒక బాబును కొనుగోలు చేసి తీసుకువచ్చి.. పిల్లలు లేని దంపతులకు వారి ఆర్థిక స్థోమతను బట్టి రూ.6 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ గ్యాంగ్‌పై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని, వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని అన్నారు. వారు మళ్లీ ఇదే పని చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు తమ బృందాలు పట్టుకున్నాయని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన గంగాధర్‌రెడ్డి.. గతంలో సృష్టి ఐవీఎఫ్ సెంటర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ కేసులో బెయిల్‌పై వచ్చిన వెంటనే మళ్లీ పాత పద్ధతిలోనే తన పని కొనసాగిస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపారు.
పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



