Sunday, November 16, 2025
E-PAPER
Homeకవితరెండు శతాబ్దాలలో జీవించి వెళ్ళిపోతున్న తరం

రెండు శతాబ్దాలలో జీవించి వెళ్ళిపోతున్న తరం

- Advertisement -

ఆత్మీయతకు అర్ధంగా మారిన తరం
ఇచ్చిన మాట కు కట్టుబడిన తరం
అభిమానమే ఆత్మ గౌర వం అనుకున్న తరం
మాటల్లో సామెతల్ని కూర్పుకున్న తరం
రాత్రిని కథల అల్లికలుగా మార్చుకున్న తరం
ప్రతి పండుగ ను ఊరంతా కలిసి చేసుకున్న తరం
ప్రతి ఆడపిల్ల కు ఊరంతా అమ్మగారింటిలా మారిపోయే తరం
రాసిన కథల కన్నా మౌఖిక కథల భాండాగారం గా మారిన తరం
సంకర భాష మాట్లాడుతున్న ఈ తరంతో
మాత భాష ను అనర్గళం గా మాట్లాడి ఇతర భాష ల ను హాయిగా దత్తత తీసుకున్న తరం
లాంతరు వెలుగు లో చదువుకున్న తరం
రిమోట్‌ తో లైట్‌ ఆఫ్‌ (స్విచ్‌ ఆఫ్‌) చేస్తున్న తరం
ఉత్తరాల కాలం నాటి తరం మెసేజుల కాలానికి అడాప్ట్‌ ఆయన తరం
సైకిల్‌ పై స్కూల్‌ కెళ్ళి,కార్లలో శీటళషవ కెళ్ళి న తరం,
ఎడ్ల బండి మీద వనభోజనాల కు వెళ్ళిన తరం
ఫ్లైట్‌ లాలో యాత్రల కు వెళుతున్న తరం
పంచెకట్టు నుండి సూటు కు ఎదిగిన తరం
టెంట్‌ లో సినిమా బ్లాక్‌ అండ్‌ వైట్‌ నుండి చీవ్‌టశ్రీఱఞ లో bశ్రీశీషసbబర్‌వతీ జూఱష్‌బతీవర చూస్తున్న తరం
పెద్దవాళ్ల ను ఇంటి ముందు మడత మంచం లో కూర్చో పెట్టు కున్న తరం
వాళ్ళ అనుభవాల చర్చ ల నే కౌన్సెలింగ్‌ సెంటర్‌ లు గా భావించుకున్న తరం
దిగుడు బావుల్లో ఈత నేర్చుకుని తమ పిల్లల కు స్విమ్మింగ్‌ పూల్స్‌ లో ఈత నేర్పిన తరం
ఇంటి ముందు గిల్లి దండ ఆడిన తరం
నేడు స్టేడియం లో కూర్చుని క్రికెట్‌ చూస్తున్న తరం
బీపీ, షుగర్‌ లకు ఆమడ దూరం ఆ తరం
నడక తోనే నాలుగు విధులు చుట్టేసేది ఆ తారం
వంటింటి వైద్యం తో ఆరోగ్యాన్ని కాపాడుకున్న తరం
చాట్‌ స్త్రజ్‌ూ ూతీశీఎజ్‌ూర లతో ఆరోగ్యాన్ని నిలకడ గా ఉంచు కుంటున్న తరం
ఉమ్మడి కుటుంబాలలో పెరిగి, పిల్లలను, విదేశీ ఉద్యోగాల దశ కు చేర్చి,
చివరికి తాము వద్ధాప్య వసతి గహాలకు నిచ్చింత గా తరలి పోతున్న తరం.

డా|| జరీనా బేగం, 9989615703

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -