నవతెలంగాణ – రాయపర్తి
అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబం రెక్క ఆడితే కానీ డొక్కా నిండని బతుకులు అలాంటి కుటుంబంలో వ్యక్తి అకాల మరణం చెందడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి చేయూతనందించారు. మండల కేంద్రంలోని కొత్త రాయపర్తికి చెందిన దుబ్బరి సైదులు గురువారం మృతి చెందాడు. దహన సంస్కారాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబానికి పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో కుటుంబాలకు సహాయం చేయడం తమ వంతు బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజాసేవ తృప్తినిస్తుందని చెప్పారు. మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేదే తమ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల బాలరాజు, రాయపర్తి గ్రామ పార్టీ ఇంచార్జి గాదె రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గారె నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రాంచందర్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి చందు రామ్, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధిలు గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్, ఐత కుమార్, ఉబ్బని సింహాద్రి, గారె నరేష్, ఎండీ యకూబ్, గారె బాబు, గారె విష్ణు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి చేయూతనందించిన పరుపాటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES