Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక.!

అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక.!

- Advertisement -

మహిళ సభ్యులకు ఉచితంగా ‘యూనిఫాం’ చీరలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మహిళలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా చీరలు పంపిణీ చేయనుంది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల (ఎన్ హెచ్ జీ) సభ్యులకు ‘రేవంతన్న’ కానుక పేరుతో ఇవ్వనున్నారు. ఈ మేరకు మండలంలో ఎన్ని సంఘాలు వాటిలో సభ్యుల సంఖ్య ఎంత? ఏయే ప్రాంతాలకు సరఫరా చేయాలనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ చీరలను చేనేత, జౌళి శాఖ తయారు చేయిస్తుండగా.. పలు జిల్లాలకు సరఫరా కూడా ప్రారంభమైంది.

ఈ వారంలోనే చీరలు రానుండగా, వాటిని భద్రపరిచేందుకు గోదాములను గుర్తించారు. ఆయా గోదాముల నుంచి మండలాలకు రవాణా చేసి గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. మహిళ లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వనుంది. ప్రతి సభ్యురాలికి రెండు చీరలు ఇస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. ప్రస్తుతం ఒకటి ఇచ్చి మరోటి తర్వాత ఇవ్వనున్నారు. అయితే.. ఈ చీర ఒకే రంగులో, ఒకే డిజైన్లో ఉండనుంది. ఎన్ హెచ్ జి మహిళలు సమావేశాలు.. కార్యక్రమాలకు వెళ్లి నప్పుడు దీనినే యూనిఫాంగా వినియోగించాల్సి ఉంటుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad