Wednesday, January 21, 2026
E-PAPER
Homeక్రైమ్తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం

తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం కొత్తపల్లిలో బుధవారం యజమాని ఇంట్లో లేని సమయంలో తెల్లవారుజామున తాళం వేసి ఉన్న ఇంట్లోకి దొంగలు ప్రవేశించి నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళితే కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అవసర నిమిత్తం ఊరికి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు తమ ఇంటికి తాళం వేసి పక్కింట్లో నిద్రించారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇమ్రాన్ ఇంటి వెనుక భాగం నుండి చొరబడి డబ్బుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున బాధితులు ఇంటికి వచ్చి చూడగా బీరువా తలుపులు తెచి ఉండడంతో అవ్వక్కయ్యారు. వెంటనే ఇమ్రాన్ కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఇమ్రాన్ ఇంటికి వచ్చి చూడగా డబ్బు నగలు లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

మూడు లక్షల డెబ్బై వేల నగదు తో పాటు ఐదు తులాల బంగారం, ముప్ఫై తులాల వెండి ఆభరణాలు దొంగతనం జరిగినట్టు ఇమ్రాన్,కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -