Wednesday, July 30, 2025
E-PAPER
Homeఆటలుసాత్విక్‌ జోడీ శుభారంభం

సాత్విక్‌ జోడీ శుభారంభం

- Advertisement -

– ట్రెసా, గాయత్రి జోడీ ఓటమి
– మ్రకావు ఓపెన్‌ బ్యాడ్మింటన్‌
మకావు (చైనా) :
మకావు ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌ 21-13, 21-15తో వరుస గేముల్లో అలవోక విజయం సాధించారు. మలేషియా షట్లర్లు హ్యాంగ్‌, చియోంగ్‌లను 36 నిమిషాల్లోనే చిత్తు చేసిన సాత్విక్‌, చిరాగ్‌ ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో హరిహరణ్‌, రూబెన్‌ కుమార్‌లు 21-15, 19-21, 14-21తో మూడు గేముల మ్యాచ్‌లో జపాన్‌ జోడీ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో ప్రియ, శృతి జంట 21-15, 16-21, 21-17తో చైనీస్‌ తైపీ అమ్మాయిలపై మెరుపు విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. చైనీస్‌ తైపీ షట్లర్లు లిన్‌, పెంగ్‌లు 16-21, 22-20, 21-15తో టాప్‌ సీడ్‌ భారత జోడీపై పైచేయి సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -