Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసాత్విక్‌ జోడీ శుభారంభం

సాత్విక్‌ జోడీ శుభారంభం

- Advertisement -

హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500

హాంగ్‌కాంగ్‌ : భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. వరల్డ్‌ నం.9 సాత్విక్‌, చిరాగ్‌లు మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో వరల్డ్‌ నం.17 చైనీస్‌ తైపీ షట్లర్లు చియు, వాంగ్‌లపై 21-13, 18-21, 21-10తో గెలుపొందారు. 59 నిమిషాల్లో ముగిసిన తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌లు రెండో గేమ్‌ను కోల్పోయినా.. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను సాధికారికంగా నెగ్గారు.
పురుషుల సింగిల్స్‌ అర్హత రౌండ్లో మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ పరాజయం పాలయ్యాడు. తరుణ్‌ మన్నెపల్లి చేతిలో 26-28, 13-21తో ఓటమి చెందాడు. తరుణ్‌ తర్వాతి రౌండ్లో 23-21, 13-21, 18-21తో మలేషియా షట్లర్‌కు ప్రధాన టోర్నమెంట్‌ బెర్త్‌ కోల్పోయాడు. శంకర్‌ ముతుస్వామిపై 21-18, 21-14తో నెగ్గిన కిరణ్‌ జార్జ్‌ మెయిన్‌ డ్రాకు చేరుకున్నాడు. మెన్స్‌ సింగిల్స్‌లో ఆయుష్‌ శెట్టి, ప్రణరు, లక్ష్యసేన్‌ బరిలో నిలువగా.. ఉమెన్స్‌ సింగిల్స్‌లో పి.వి సింధు, అనుపమ, రక్షితలు పోటీపడుతున్నారు. హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లో నేటి నుంచి ప్రధాన టోర్నీ ఆరంభం అవుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad