గుంతల మయంగా మారిన కాసులాబాద్ రోడ్డు
యువకుల శ్రమదానంతో మట్టిని పోస్తున్న వైనం
మంజూరైన పనులు ప్రారంభించని అధికారులు
నవలంగాణ – మిరుదొడ్డి
సంవత్సరాలు గడిచినా.. ప్రభుత్వాలు మారిన తమ గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టించుకోవాల్సిన పాలకులు, అధికారులు చూసి చూడనట్లుగా వదిలేయడంతో సమస్య జటిలమై, ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. గుంతల రోడ్డుపై ఆర్టీసీ బస్సు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఎవరు పట్టించుకోరని గ్రామ యువకులంతా శ్రమదానానికి నడుం బిగించారు. మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామ యువకులు బీటీ రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. గత పది సంవత్సరాలుగా మీరుదొడ్డి నుండి కాసులాబాదుకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన ఎవరు పట్టించుకోలేదని వాపోయారు. భారీ గుంతలు ఏర్పడడంతో ఆర్టీసీ అధికారులు సైతం బస్సును రాకుండా నిలిపివేశారు.
రోడ్డు బాగు అయితే తప్ప బస్సు నడపమని తేల్చి చెప్పారు. ప్రభుత్వాలు మారిన తమ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి సమస్య మాత్రం మారకపోవడంతో గ్రామ యువకులు ట్రాక్టర్ ల ద్వారా మట్టిని తీసుకువచ్చి రోడ్డుపై పోసి శ్రమదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఐదు సంవత్సరాల కాలంలో ఎంతోమంది గుంతల మయంగా మారిన రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యారని గుర్తు చేశారు. వాహనాదారుల ప్రాణాలు పోతున్న అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైన పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి వెంటనే బీటీ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క రోడ్డుకు నిధులు మంజూరైన కూడా పనులు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు యువకులంతా ఏకమై శ్రమదానం చేస్తూ చెట్లను తొలగించడంతోపాటు ట్రాక్టర్లతో గుంతలను పూడ్చివేశరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మిడిదొడ్డి నుండి కాసుల బాద్ మోతే చిట్టాపూర్ వరకు ఈ యొక్క రోడ్డు పనును పూర్తిచేయాలని యువకులు కోరుతున్నారు.
సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES