![]() |
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి పదవ తరగతి చదువుకున్న 2003-04 సంవత్సరం పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మండల కేంద్రంలోని బంకిట్ హాల్ వేదికయ్యింది. రెండు దశాబ్దాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తోటి మిత్రులను ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులమంతా ఒకచోట కలవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం అంతా కలిసి గ్రూప్ ఫోటోలు దిగి, సహపంక్తి భోజనాలు చేశారు.