నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 2000-01 సంవత్సరం పూర్వ విద్యార్థులు అందరు కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మండల కేంద్రం శివారులోని లలిత గార్డెన్ ఫంక్షన్ హాల్ వేదికయ్యింది. 25 సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విద్యాబుద్దులు నేర్పిన గురువులను, తోటి మిత్రులను ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత చిన్ననాటి స్నేహితులంతా ఒకచోట కలవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం అంతక్షరి, క్విజ్, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు మెమొంటోస్ అందజేశారు. కార్యక్రమం ప్రారంభంలో తమకు విద్యార్థులు నేర్పి దివంగతులైన గురువులకు, మిత్రులకు, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి ఒక నిమిషం మౌనం పాటించారు.
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES