16 ఏళ్ల తర్వాత ఒక్కచోటికి పూర్వ విద్యార్థులు
నవతెలంగాణ – మిడ్జిల్
మహబూబ్ నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం, వస్పుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 120 మంది విద్యార్థులు 16 ఏండ్ల తరువాత అదే పాఠశాలలో ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రామచంద్రయ్య,గోప్రియనాయక్,రమేష్, వాసంతి,నవనీత, మహేశ్వర్ మాట్లాడుతూ తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను గుర్తించుకుని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.ప్రతి విద్యార్థి ఉన్నతస్థాయికి ఎదిగినప్పుడే తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన గురువులకు గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు కాలే,స్వప్న, లక్ష్మీ, మంజుల, గీత, సునీత, సాలమ్మ, మయూరి, జయమ్మ, విజయలక్ష్మి, మంజుల, రాధిక, పద్మ, నవనీత, శబరి, వినోద్, ఆంజనేయులు, రఫీ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.



