Saturday, August 2, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా కోటి పార్థివ లింగార్చన మహోత్సవం..

ఘనంగా కోటి పార్థివ లింగార్చన మహోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం రోజున కన్వీనర్ ద్యావరశెట్టి రజిత మహిళా బృందం సహకారముతో మండల కేంద్రంలోని జక్కు లచ్చవ్వ బుచ్చయ్య ఆర్యవైశ్య కల్యాణ మండపంలో కోటి పార్థివ లింగార్చన మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా దీపారాధన, కలశస్థాపన ,గణపతి ,గౌరీపూజ ,నవగ్రహ ఆరాధన ,మరియు భక్తులు పుట్టమన్ను చేత 108 పార్థివ లింగములు చేసి ఆ శివలింగాలకు పంచామృత అభిషేకము రుద్రాభిషేకము, భస్మార్చన ,పుష్పార్చన ,బిల్వార్చన, ధూప దీప నైవేద్యములతో పూజలు చేశారు. శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి మరియు బాసర శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధా శ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీ నిర్మల అంబికానాథ శర్మ కరకమలములచే పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల దేవాలయం ఈశాన్య భాగమున కోటి పార్థివలింగ స్తూపము నిర్మించినామని అందులో కోటి (పార్థివ)శివలింగములను స్థాపన చేయ దలచినామని , కోటిలో 90 లక్షల శివలింగాలను భక్తులతో చేయించడం, స్థాపన చేయడము జరిగినదని ,ఇంకా 10 లక్షలు లింగాలు చేయవలసి ఉన్నదని మరియు ఆసక్తి గల మహిళలు 9948332032 సంప్రదించి వారి వివరాలు తెలిపినచో పుట్టమన్ను ఉచితముగా ఇచ్చి మీతో శివలింగాలు మరియు పూజ కార్యక్రమాలు చేయించి అట్టి లింగములను కోటి పార్థివలింగ స్తూపం యందు నిక్షిప్తం చేయబడును అని శర్మ తెలిపినారు.

కోటి పార్థివలింగార్చన నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మీ సౌభాగ్యవతి ద్యావరశెట్టి రజిత మాట్లాడుతూ శ్రావణమాసం శివార్చన పార్థివలింగార్చన మిక్కిలి గొప్పదని దాని ప్రాశస్త్యం గురించి వివరిస్తూ.. సుమారు 80 ఆర్య వైశ్య కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పినారు. బాసర సరస్వతీ స్తూప పార్థివ లింగస్తుప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిర వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధశర్మను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు జక్కు భూమేష్,గోపాల కృష్ణ,మల్యాల కిరణ్, ద్యావరశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -