నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి,హెచ్ తిరుపతి అధ్యక్షత నిర్వహించారు. సమావేశంలో పాఠశాలతో వారికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేస్తూ..ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని వివరించారు.
తరువాత ఉపాధ్యాయులు 10వ విద్యార్థులకు చాలా ఉపయోగపడే సూచనలు చేశారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కుమారస్వామి కాంట్రిబ్యూశన్ తో మెరిట్ విద్యార్థులకు, క్రమం తప్పకుండా స్కూల్ కు వచ్చిన 10వ తరగతి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వీడ్కోలు సమావేశానికి తాడిచెర్ల సర్పంచి బండి స్వామి, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, ఉపాధ్యాయులు జయభాస్కర్, జగన్ నాయకు, శివలింగం, శ్రీనివాస్, స్వర్ణలత, పూర్ణచందర్, సరస్వతి, శ్రీధర్, వెంకటేశ్వర్లు, రాజేందర్, శ్రీనివాస్, శివరాణి, మహేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.



