- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సభా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ గవర్నర్ పేరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ హనుమంత రెడ్డి , ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్లు శ్రీ బండారి ప్రసాద్ శ్రీ సర్కిలి సృజన్, మాజీ కౌన్సిలర్ శ్రీ లిక్కి శంకర్ అందరూ పాల్గొని విద్యార్థులకు ఇష్టంతో లక్ష్యం ఏర్పరచుకొని చదవాలని 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



