నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి జిపి గ్రామం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు విడుకోలు సమావేశం ఘనంగా ఎంఈఓ, హెచ్ఎం తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అనీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వీడ్కోలు సమావేశం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా చదవాలని తెలిపారు.
పరీక్షలు మంచిగా రాసి 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాలోని మంచిర్యాంకులు సాధించాలని విద్యార్థిని, విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా సమయాన్ని సరిగా వినియోగించుకుని పరీక్షలను ధైర్యంగా రాయాలని, మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, గ్రామానికి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. క్రమశిక్షణతో చదివితే తప్పకుండా అత్యధిక మార్కులు సాధించగలరని విద్యార్థులకు సలహా ఇచ్చారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తన భవిష్యత్తుకు మొట్టమొదటి అడుగు అని పదవ తరగతి పాస్ అయితే తర్వాత ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయని పదవ తరగతికి సంబంధించిన పాఠ్య అంశాలు ఇంటర్లో వస్తాయని విద్యార్థులు మంచి భవిష్యత్తుకు ఇదే మొట్టమొదటి అడుగు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, గ్రామ కార్యదర్శి రమేష్, వార్డ్ సభ్యులు శంకర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.



