Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బహుజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మూలవాసుల పండుగ

బహుజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మూలవాసుల పండుగ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ దేశంలో ముల వాసుల పండుగ (సమత) సమానత్వం, (న్యాయత) న్యాయం, (బంధుత) బంధుత్వం అంశాలతో బుద్ధుని మార్గంలో అశోక విజయదశమి ఉత్సవాలను అంబేద్కర్ యువజన సంఘం, బామ్ సేఫ్, భారత్ ముక్తి మోర్చ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. సామ్రాట్ అశోక చక్రవర్తి ఫోటోకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలయ్ బలయ్ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ క్రీస్తుపూర్వం 261 సంవత్సరంలో సామ్రాట్ అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తరువాత అక్కడ జరిగిన మారణ హోమాన్ని గ్రహించి బౌద్ధమత గురువు ఉపగుప్తుని సలహా మేరకు బౌద్ధ మతాన్ని స్వీకరించి బుద్ధుని ఆచార సంప్రదాయాల ప్రకారం శాంతి, సత్యము హింస సమత, న్యాయత, బంధుత అనే అంశాల వైపు వెళ్లాలని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి ఆయుధాన్ని వదిలేసి తనలో ఉన్న చెడు లక్షణాలు కామం, క్రోధం, ఈర్ష, ద్వేశం, పగ ఇలాంటి చెడు లక్షణాలు వదిలిన రోజు అంటే చెడును జయించి మంచిని పొందుకున్న రోజు కాబట్టి దీనిని విజయదశమిగా జరుపుకోవాలని తన రాజ్యాంలో ప్రజలందరికీ పిలుపునిచ్చి అప్పటి నుంచి విజయదశమిని పొందగలరు.

భారతదేశంలోని ప్రజలందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జరుపుకుంటున్నారు అని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుభాసి నరేందర్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ క్యాతం సిద్ధరాములు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తల గంగారం, గౌరవాధ్యక్షులు కొత్తపల్లి మల్లయ్య, బామ్ సెప్ జిల్లా అధ్యక్షులు గడసాయి గౌతమ్, కోశాధికారి ఏసురత్నం, డిటియు జిల్లా అధ్యక్షులు ఎల్ల గారి శంకర్, డిటియు రాష్ట్ర కార్యదర్శి అశోక్, మైనార్టీ నాయకులు హజి, నాయకులు పత్రీజీ ధ్యాన కేంద్ర జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, కిరణ్, ప్రదీప్, రాజు, బాలయ్య సిద్ధ రాములు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -