– సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయాల శుద్ధి
– ఆయా గ్రామాల్లో మామిడి తోరణాలతో అలంకరణ
నవతెలంగాణ-తాడ్వాయి
ఆదివాసీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు వెలసిన గ్రామాల్లో బుధవారం మండ మెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. వారికి పూజారు లు పూజలు చేసి మహా జాతర ఆరంభానికి శ్రీకారం చుట్టారు. మేడారం మహా జాతరకు వారంరోజులు ముందుగా ఆయా దేవతల వంశీయులు, పూజారులు గిరిజన సంస్కృతి, ఆచార, సంప్రదాయాల వ్యవహారాలతో మండ మెలిగే పండుగను నిర్వహిం చడం ఆనవాయితీ. సమ్మక్క వెలిసిన మేడారంలో సారలమ్మ కొలువైన కన్నపల్లిలో, పగిడిద్దరాజు, గోవిందరాజులు వెలసిన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల కామారం, ములుగు జిల్లా ఏటూరు నాగారం మం డలం కొండాయి తదితర గ్రామాల్లో ఆయా దేవతల పూజారు లు బుధవారం ఉదయమే ఆలయాలను, దేవేరుల వస్తు సామగ్రిని శుభ్ర పరిచారు. అమ్మ వార్ల గద్దెలను, దేవాలయాలను.. మహిళలు ముగ్గులతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం డోలు వాయిద్యాలు, డప్పు చప్పులతో గ్రామ దేవతలకు, బోడ్రాయిల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం గ్రామాల చివరన బూరుగు స్తంభాలు నాటి నిమ్మ కాయ లు, మిరపకాయలు, అనప కాయలతో మామిడి తోరణాలు కట్టారు. రాత్రి వేళ మేడారంలో అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి గురువారం వేకువ జాము వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జాగరణ చేశారు. ఈ సమయంలో దర్శనాలు నిలిపి వేశారు. గురువారం నుంచి మహా జాతర ప్రారంభమైనట్టు శుభ సంకేతాలు వెలువడ్డాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సమ్మక్క పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. 28 నుంచి 31వరకు మేడారం జాతర కుంభ మేళాగా జరగనున్నది. బుధవారం ఆయా గ్రామాల్లో జరిగిన మండ మెలిగే పూజా కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన వంశస్థులు, కొక్కెర, మల్లెల, దోబె, చందా వంశీలతోపాటు దెబ్బ గట్ల, పెనక పూజారులు పాల్గొన్నారు. మేడారంలో జరిగిన కార్యక్రమంలో పూజారులు సిద్ధబోయిన మునేందర్, కొక్కెర కృష్ణయ్య, దోబె నాగేశ్వరరావు, మల్లెల పూర్ణ, సిద్దబోయిన మహేష్, నితిన్, వసంతరావు, స్వామి, సురేందర్, పీరీల వెంకన్న, కుర్సం రవి, కొక్కెర రమేష్ ,రానా రమేష్‌తోపాటు కులపెద్దలు, గ్రామస్తులు, యువ తీ యువకులు, గ్రామ ఆడబిడ్డలు పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఈ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించారు.
మేడారంలో ఘనంగా మండ మెలిగే పండుగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



