నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం ఫుడ్ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, దాదాపు 200 మంది విద్యార్థులు 350 కు పైగా వివిధ రకాల ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యాభ్యాసంలోనే కాకుండా, పౌష్టికాహార తయారీలోనూ ప్రతిభ చూపడం ఎంతో ఆనందకరమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ, డైరెక్టర్ సురేష్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్స్ జావిద్, రవి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మంజీర కళాశాలలో వైభవంగా ఫుడ్ ఫెస్టివల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



