వేలాదిగా తరలివచ్చిన భక్తజనం..
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోనిలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి పోచమ్మ గంగ నీళ్ల జాతర రెండు రోజుల పాటు వైభవంగా జరిగింది. శనివారం అలయం నుండి ఆభరణాలను సేవాదారులు భక్తులు కాలినడకన బాజాభజంత్రీలతో ఎస్సై శ్రీకాంత్,పోలీసుల బందోబస్తు నడుమ సాంగ్వి గ్రామానికి చేరుకొని ఆదివారం ఉదయాన్నే గోదావరి నది జాలతో నగలను శుద్ధి చేసి తిరిగి సాయంత్రానికి అడెల్లి పోచమ్మ ఆలయానికి చేసుకున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ భక్తులు తెచ్చిన గోదావరి జాలతో అమ్మవారిని అభిషేకించి నగలను అలంకరించి మంగళ హారతులిచ్చారు.
ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరికి వేళ్ళు వచ్చిన భక్తులు దేవిని దర్శించుకోగా భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఉదయం నుండి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్,మెదక్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర లోని నాందేడ్, నాగపూర్, చంద్రపూర్, ఛత్తీస్ ఘడ్ నుండి యాత్రికులు ప్రత్యేక వాహనాల్లో ఆలయానికి చేరుకొని అమ్మవారికి దర్శించుకొని పెరుగన్నం బెల్లం పాయసన్ని నైవేద్యంగా సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు.
ఇదిలా ఉంటే.. గోదావరి నది నుండి అమ్మవారి నగలను శుద్ధి చేసి కాలినడకన వస్తుండగా.. ఆయాగ్రామల మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికి అమ్మవారి నగలను పూజలు చేసి మొక్కుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ సింగం భోజ గౌడ్, ఈ ఓ రమేష్, ధర్మకర్తలు, బారికెట్లు,టెంట్లు తాగునీరు,వైద్య శిబిరం,సౌకర్యాలను కల్పించగా ఆలయ పరిసరాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఆద్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.