నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం విద్యాలయంలో పాఠశాల ప్రిన్స్ పాల్, కరస్పాండెంట్ ఎంకె సుదర్శనన్ ఆధ్వర్యంలో గురువారం ముందస్తుగా గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి బోధించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విశ్వదీప్తిలో ఘనంగా గురుపూజోత్సవం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES