Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం

జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రముఖ సామాజిక సంస్థ గంగారం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ( జి ఆర్ ఎం సొసైటీ ) ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఎల్లమ్మ గుట్టలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్న విఠల్ రావు హాజరు కాగా ఎన్పీడీసీఎల్ సీనియర్ ఇంజనీర్ (ఓపి) రవీందర్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రసూల్ బి, అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ, పూర్ణచందర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.ముందుగా జిఆర్ఎం సొసైటీ అధ్యక్షులు మూడాల నరేష్ బాబు మాట్లాడుతూ.. ఈరోజు ఎంతో మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయినులని సన్మానించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు.

విద్యుత్ శాఖలో ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత ఊరికే ఉండకుండా తన తండ్రి గారైన మొదటి తరం ఫోటోగ్రాఫర్ స్వర్గీయ మూడాల గంగారం, తల్లి మూడాల లలిత పేరు మీద 2011లో సొసైటీని స్థాపించి గత 15 సంవత్సరాలుగా వివిధ సామాజిక కార్యక్రమాలు తన పెన్షన్ డబ్బులు నుంచి ఖర్చు చేసి నిర్వహిస్తున్నానని, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విధానంలో తన కలుగుతున్న తృప్తి చాలా గొప్పదని ఆయన సంతోషపడ్డారు. అనంతరం ఎంపీడీసీఎల్ ఎస్.ఈ. రవీందర్ మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ప్రతిభగలిగి అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అన్ని పాఠశాలల్లో, సంస్థల్లో సన్మానించడం జరుగుతూ ఉంటుంది.

కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందని అదే, గత 15 సంవత్సరాలుగా తన సొంత పెన్షన్ డబ్బులు తో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో పేరు గడించిన సామాజికవేత్త నరేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయం అని ఆయన అన్నారు. నరేష్ బాబు గారు మా శాఖలో పనిచేసిన వ్యక్తిగా ఎంతో గర్వపడుతున్నామని అన్నారు. రిటైర్ అవ్వగానే జీవితం చరమ దశకు వచ్చినట్టుగా భావించి చాలామంది నిరాశ, ని‌స్పృహల్లో కాలం గడుపుతూ ఉంటారని అలాంటి వారందరికీ నరేష్ బాబు ఒక స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. ఎంతమంది ఉపాధ్యాయ ఉపాధ్యాయినులను ఒక చోటకు చేర్చి సన్మానించడం ఆషామాషి విషయం కాదని, ఆయన ఎంతో ఓపికగా అందరిని ఆహ్వానించి సన్మానించడం చాలా గొప్ప విషయం అని ఆయన ప్రశంసించారు.

తదుపరి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రసూల్ బి మాట్లాడుతూ.. ఈనాటి ఈ ఉపాధ్యాయ దినోత్సవం లో తమ సంస్థకు చెందిన సుమారు 30 మంది అంగన్వాడీ టీచర్లకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని, వారు చేసే సేవలను జి ఆర్ ఎం సంస్థ గుర్తించి వారిని ఘనంగా సన్మానించడం చాలా గొప్ప విషయమని, నరేష్ బాబు కి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉదాత్తమైనదని తాను కోవత్తులా కరుగుతూ కొన్ని జీవితాలకి వెలుగునిచ్చే వ్యక్తి ఉపాధ్యాయుడని ఉపాధ్యాయులు లేకపోతే సమాజం లేదని సమాజాన్ని నిర్మించే వ్యక్తులు ఉపాధ్యాయులు ధన్యజీవులని ఆమె కొనియాడారు.

తర్వాత ముఖ్య అతిథి దాదన్న గారి విటల్ రావు మాట్లాడుతూ.. ప్రతి కార్యక్రమానికి నరేష్ బాబు తనను ఆహ్వానించి ముఖ్య అతిథిగా తన చేతుల మీదుగా కొన్ని వందల మందికి సన్మానం చేయించడం జరిగిందని, ఈరోజు కూడా ఈ సంస్థ ద్వారా సన్మానం అందుకుంటున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. రిటైర్ అయిన తర్వాత మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు చాలా అరుదుగా ఉంటారని నరేష్ బాబు అందరికి కూడా ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా గుర్తించవచ్చని ఆయన అన్నారు. అలాగే చాలీచాలని జీతాలతో సామాజికంగా ప్రతి ఇంటింటికి తిరిగి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లు, అలాగే ప్రభుత్వానికి అండదండగా ఉంటూ పసిపిల్లల ఆలన,పాలను చూస్తూ ప్రతి చిన్నారులకి, మాత శిశుకి సరైన పోషకాహారాలు అందిస్తూ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న రేమనెంట్ వెల్ఫేర్ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ సందర్భంగా ఇక్కడికి రావడం శుభ సూచకమని వారి సంస్థ ఆధీనంలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లు సన్మానం గ్రహించడం సంతోషదాయకమని ఆయన అన్నారు.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత దేశ ద్వితీయ రాష్ట్రపతిగా ఎన్నో మనల్ని అందుకున్నారని, దేశాభివృద్ధికి ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. అలాగే ఉపాధ్యాయుల కి ఒక ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఉపాధ్యాయుని స్థాయి నుంచి భారత రాష్ట్రపతి వరకు ఎదగడం చాలా గొప్ప విషయమని ప్రతి ఉపాధ్యాయుడు వారిని ఆదర్శంగా తీసుకొని తమ విద్యార్థులని అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది దేశానికి మంచి పౌరులు అందజేయాలని ఆయన హితవు చెప్పారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు అతిథులని ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 104 మంది, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయ ఉపాధ్యాయినులు, సామాజికవేత్తలను అతిథులు శాలువా, మెమొంటో, సర్టిఫికేట్ తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిఆర్ఎం సొసైటీ ఉపాధ్యక్షురాలు లీలా, సెక్రెటరీ శ్రీనివాస్ ట్రెజరర్ లక్ష్మీనారాయణ, ఆక్స్ఫర్డ్ పాఠశాల నిర్వాహకులు జిఆర్ఎం సొసైటీ అడ్వైజర్ మామిడాల మోహన్ పాఠశాల హెచ్ఎం రమణ పాఠశాల సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయ ఉపాధ్యాయినులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad