Monday, December 29, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఆరోగ్య జాతర

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఆరోగ్య జాతర

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హాత్నూర్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రతిరోజు నేర్చుకుని ఆరోగ్య కళాశాల కార్యక్రమాలను వారి యొక్క అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, పోషణ ,మానసిక ఆరోగ్యం, ఉద్వేగ పరిపక్వత యాంటీ డ్రగ్స్, కాలానుగుణ వ్యాధులు, వ్యక్తిత్వ వికాసము తదితర అంశాలను సంవత్సరమంతా తెలుసుకొని దానిని అధ్యాయించుకున్నట్లు విద్యార్థులు తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించినందున జిల్లా కలెక్టర్ కి, అధ్యాపకులందరికీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్, ఆరోగ్య కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ షిండే జ్ఞానేశ్వర్, అధ్యాపకులు ప్రదీప్ కుమార్, భీమేష్, అశోక్ రెడ్డి, నవీన్ రెడ్డి, వనజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -