నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని పద్మశాలి విజయ సంగం ఫంక్షన్ హాల్ లో మంగళవారం హిందూ ధర్మ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కమ్మర్ పల్లి ఉప మండలంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్త నర్ర వెంకట శివకుమార్, ప్రాంత సహ భౌద్దిక్ ప్రముఖ్ వీశోక తీర్త స్వామీజీ, ఇస్కాన్ నరహరి స్వామీజీ పాల్గొని మాట్లాడారు. హిందువుల ఐక్యత కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయం సనాతనంగా కాపాడుతూ వస్తుందన్నారు. దీనిని కాపాడటానికి మనమందరం ప్రయత్నం చేయాలని కోరారు.
అంతకుముందు స్థానిక భరతమాత విగ్రహం నుండి ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఏనుగు గంగారెడ్డి, సారగల రాజేశ్వర్, వూట్నూర్ రాజశేఖర్, సల్లూరి కిషన్, రుద్ర మధుసూదన్, దశగౌడ్, చెట్లపల్లి శంకర్ గౌడ్, సమేరా సుమన్, భోగ రామస్వామి, సుంకేట అశోక్, గడ్డం పురుషోత్తం, చింతకుంట శ్రీనివాస్, వినోద్, దొంతుల రమణయ్య, నరేందర్ డిష్, రెంజర్ల గంగాధర్, చింత ప్రవీణ్, హనుమాన్ మాల ధారణ స్వాములు, గంగమ్మ స్వాములు, 7 గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.



