Saturday, April 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధిక దిగుబడి సాధించిన రైతుకు ఘన సన్మానం

అధిక దిగుబడి సాధించిన రైతుకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామం చెందిన రైతు దానేవార్ సంతోష్ గత ఏడాది ఎకరానికి 55 క్వింటాల మక్క పంట దిగుబడి సాధించినందుకుగాను కామారెడ్డి జిల్లా ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీ అధికారులు నడింపల్లి గ్రామ రైతును ఘనగా సన్మానించారు. ఈ సందర్భంగా శనివారం పడం పల్లి గ్రామం దానే వార్ సంతోష్ మక్క పంట పొలంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ ఎన్ కే 7884 అనే రకం విత్తనం విత్తుకొని ఒక ఎకరానికి 55 క్వింటాల్ అత్యధిక మక్క దిగుబడి సాధించిన సంతోష్ ను శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను సీడ్ కంపెనీ వారు అందించారని తెలిపారు.

ఈ సందర్భంగా రైతు సంతోష్ మాట్లాడుతూ గతేడాది ఎకరంన్నర భూమిలో మక్కపండిస్తే 85 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అన్నారు. ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా నాలుగు ఎకరాల మక్కా పంట పండిస్తున్నాని తెలిపారు. మక్క పంట ఏపూగా పెరిగందని, గత ఏడాది 55 క్వింటాలు దిగుబడి వస్తే ఈ ఏడు 55 క్వింటాళ్ల పైనే దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు, ఉప సర్పంచ్ పావుడే సవిత , మాజీ సర్పంచ్ పావుడే గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ వాగ్మారే లక్ష్మణ్,   కామారెడ్డి జిల్లా కు సంబంధించిన ప్రైవేట్ సీడ్ కంపెనీ  డీలర్లు, అధికారులు, రైతులు పావుడే బస్వంత్, హనుమాజీ వార్ వీర్ భధ్ర, లక్షెట్టి ఉమాకాంత్, మాలి పటేల్ చంద్రకాంత్, మాజీ సైనిక్ ఉద్యోగి కాశీనాథ్ స్వామి, లక్సెట్టి మల్లికార్జున్, చాయ్ బద్రు, కత్తే వార్ రాజు , వాగ్మారే మొగులాజి, సిద్ధుగొండ, వాగ్మారే హుల్ల్ రామ్ , వాగ్మారే ప్రకాష్,  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -