నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మారుమూల పల్లెటూరు అయినా లొంగన్ గ్రామానికి చెందిన సోదరుడు గజానంద్ సోన్ కాంబ్లే ఆర్థికశాస్త్రంలో బంగారు పతకాన్ని సాధించారు. జుక్కల్ నియోజకవర్గ ప్రాంతంలోని యువతకు ఆదర్శంగా నిలిచినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. ఎంపీపీఎస్ లొంగన్ ప్రధానోపాధ్యాయులు షేక్ అఫ్రోజ్ గ్రామ మాజీ సర్పంచ్ నాగలిగితే ఉషారాణి, గ్రామ పెద్దల సమక్షంలో గజానంద్ గారిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ ఎస్ పాఠశాల విద్య అఫ్రోజ్ మాట్లాడుతూ.. ఆర్థిక శాస్త్రంలో మరిన్ని విజయాలు సాధించాలని, మీ విజయాన్ని చూసి జుక్కల్ నియోజకవర్గ ప్రాంతంలోని ఎందరో యువకులు డిగ్రీ పీజీ లలో యూనివర్సిటీల స్థాయిలలో మరెన్నో కోర్సులలో ఉత్తమమైన ఫలితాలు సాధించి జుక్కల్ నియోజకవర్గ ప్రాంత విద్యారంగానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు. ఈ నేపథ్యంలో మనస్ఫూర్తిగా మీ విజయానికి అభినందనలు అని తెలిపారు. అనంతరం ఆయయను శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసి 79 వ పంద్రాగస్టు వేడుకలను నిర్వహించడం జరిగింది.
ఆర్థిక శాస్త్రంలో అవార్డు గ్రహీతకు ఘన సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES