నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో ఆదివారం కురుమ సంఘం కార్యాలయం వద్ద, సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పురపాలక సంఘం చైర్మన్, బీజని బాలమణి భాస్కర్, కౌన్సిలర్లు బీజన కళ్యాణి మధు, మల్లెల సరిత శ్రీకాంత్, జూకంటి సంపత్, జట్ట నీరజ సిద్ధులను కురుమ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జ్ఞాపికలు అందజేశారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా, కౌన్సిలర్ గా, పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భాన్ని పురస్కరింకొని సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గిడి శ్రీశైలం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకాంటి రవీందర్, సంగం నాయకులు ఎగ్గిడి మల్లయ్య, ఎగిడి ఉప్పలయ్య, జూకంటి ఉప్పలయ్య, బందెల విష్ణుమూర్తి, ఎగిడి శ్రీనివాస్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



