నవతెలంగాణ – పరకాల
పరకాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రవిందర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ ని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్, కార్యాలయ సిబ్బంది కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపిడిఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకురాలు శైలశ్రీ, ఏఈ శ్రీలత, ఈసీ రజనీకాంత్, టైపిస్ట్ మసూద్ అలీ, జూనియర్ సహాయకులు ప్రియాంక, శ్రీలక్ష్మి, కార్యాలయ సహాయకులు వరుణ్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
నూతన ఎంపీడీఓకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



