- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని లింగయ్యపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి వనిత- శ్రీనివాస్ లు నూతనంగా ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికైనందున మండల విశ్వబ్రాహ్మణ నాయకులు మంగళవారం శాలువా కప్పి సన్మానించారు. గ్రామ అభివృద్ధికి తోడ్పాటున అందించాలని గ్రామాన్ని ఉత్తమ గ్రామపంచాయతీగా నిలుపుటకు కృషి చేయాలని సంఘ నాయకులు కోరారు.. కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్ గౌరవాధ్యక్షులు యశోద గురువయ్య జన్నారం మండల అధ్యక్షులు వేయికండ్ల రవి చారి రేండ్లగూడ అధ్యక్షులు లక్ష్మీనాచారి ప్రధాన కార్యదర్శి బందోజీ లక్ష్మీనరసయ్య కంచి నరసయ్య శ్రీనివాస్ కిరణ్ హనుమాన్ శ్రీనివాస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



