నవతెలంగాణ – జన్నారం
మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పాలజి శ్రీనివాస్ ని, గ్రామంలోని శివశక్తి సామాజిక సంక్షేమ సంస్థ – రోటిగూడ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో, ముఖ్యంగా అక్కడ మరణించిన కార్మికుల మృతదేహాలను వారి కుటుంబాలకు చేరవేయడంలో, శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తూ మానవతా సేవలో ముందుంటున్నారు. అలాగే గల్ఫ్‌లో చిక్కుకున్న లేదా ఆపదలో ఉన్న కార్మికులకు సహాయం చేయడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించడం వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు.
రోటిగూడ గ్రామానికి చెందిన గల్ఫ్ కమిటీ మరియు శివశక్తి సామాజిక సంక్షేమ కమిటీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ, గ్రామ ప్రజల మన్ననలు పొందిన శ్రీనివాస్ ని సన్మానించడం పట్ల సంస్థ సభ్యులు గర్వంగా భావించారు, ఈ సందర్భంగా శివశక్తి సామాజిక సంక్షేమ సంస్థ అడ్మిన్ సేపురి గోపాల్ మాట్లాడుతూ, “పాలజి శ్రీనివాస్ స్వార్థరహితంగా చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శం. గల్ఫ్‌లో పనిచేసే మా గ్రామ కార్మికుల సమస్యలను ప్రభుత్వ స్థాయిలో కూడా గుర్తింపుపొందేలా ఆయన కృషి చేస్తున్నారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విరాళదాతలు, యువత మరియు కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీనివాస్ ని శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు.
రోటిగూడ గల్ఫ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES