- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో శుక్రవారం పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించారు. ఆరుగాలంరైతన్నలుకు నేస్తాలు అయిన బసవన్నలను శుభ్రం గా కడికి అందంగా ముస్తాబు చేశారు. డప్పుచప్పుళ్ల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం బసవన్నలకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. ఎడ్లు లేని రైతులు మట్టి ఎడ్ల ప్రతిమలకు పూజలు చేశారు. ఆనంతరం ప్రతి ఇంట్లో పిండి వంటలతో పాటు వివిధ రకాల వంటకాలతో భోజనం కార్యక్రమం నిర్వహించారు.
- Advertisement -