నవతెలంగాణ-పాలకుర్తి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో గల రాజీవ్ చౌరస్తాలోని స్టేషన్ ఘన్పూర్ రోడ్డులో గల గజానన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహిళలు 516 రకాల పిండివటలతో పాటు స్వీట్లతో గణనాధునికి మహా నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజానన ఉత్సవ సమితి అధ్యక్షులు చారగొండ్ల ప్రసాద్ మాట్లాడుతూ గజానన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి ఎనగందుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సోమయ్య, కోశాధికారి చిలుకమారి సోమేశ్వర్, నిర్వాహకుల తమ్మి రాంబాబు, భాను, ప్రదీప్ కుమార్, సోమేశ్వర్, రాము, సత్తిబాబు, అల్లాడి వెంకన్న, కృపాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పిండి వంటలతో గణనాధునికి మహా నైవేద్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES