- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
మండల విద్యాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ గుప్తా పదవి విరమణ పొందడంతో మండల ఉపాధ్యాయులు ఆయన పదవి విరమణ అభినందన సన్మాన సభను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమైందని, అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు భగత్ రామకిషన్, జే. భూమన్న, జల్కె పాండురంగ్, చిలుకూరి భూమన్న, ఉపాధ్యాయులు రమేష్, సదానందం, చంద్రకాంత్ బాబు, బాపూరావు రావు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -