- Advertisement -
నవతెలంగాణ- సదాశివపేట
సదాశివపేట పట్టణంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆర్.రవీంద్రనాథ్ ఉద్యోగ విరమణను పురస్కరించుకుని అభినందన సభ నిర్వహించారు. బసవ సేవా సదన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ గారిని సన్మానించిన సాయినాథ్, ఆయన విద్యా రంగంలో చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. అనేక మంది విద్యార్థుల భవితకు బాటలు వేసిన ఉపాధ్యాయుడిగా ఆయన గుర్తుండిపోతారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కూడా సమాజ హితానికి తన అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రవీంద్రనాథ్ గారి భవిష్యత్ జీవితం ఆరోగ్యంతో, ఆనందంతో సాగాలని ఆకాంక్షించారు.
- Advertisement -



