Sunday, September 21, 2025
E-PAPER
Homeజిల్లాలుబొల్లారం సతీష్ గౌడ్ కు ఘన సత్కారం..

బొల్లారం సతీష్ గౌడ్ కు ఘన సత్కారం..

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని యంచ గ్రామానికి చెందిన బొల్లారం సతీష్ గౌడ్ విదేశాల్లో వైద్య విద్య ఎంబిబిఎస్ పూర్తిచేసుకుని సొంత గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామస్తులు స్వాగతం పలికి శాలువతో ఆదివారం సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో పెరిగి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని అకుంఠిత దీక్షతో తండ్రి లింగాగౌడ్, తల్లి స్వర్గీయ శ్రీమతి శశికళ కోరికను నెరవేర్చేందుకు విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి విచ్చేయడం తమ గ్రామానికి ఎంతో గౌరవ కారణమని అన్నారు. భవిష్యత్తులో పేదలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మహేష్ గౌడ్, సాయిరాం గౌడ్, కుమార్ గౌడ్, స్థానిక నాయకులు, వి డి సి సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -