- Advertisement -
న్యూఢిల్లీ : ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్ల తప్ప’ అంటూ శ్రామికలోకానికి పిలుపునిచ్చి సమ సమాజ నిర్మాణానికి మార్గం చూపిన కార్ల్ మార్క్స్ మహాశయుడి 143వ వర్థంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) శనివారం నాడు ఘన నివాళులర్పించింది. న్యూఢిల్లీలోని సీపీఐ(ఎం) ప్రధానకార్యాలయం ఎకె గోపాలన్ భవన్‌లో పార్టీ ప్రధానకార్యదర్శి ఎంఎ బేబీ, పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు, అరుణ్ కుమార్, విజూ కష్ణన్, కేంద్ర కమిటీ సభ్యులు రాజేంద్ర శర్మ, వి మురళీధరన్ తదితరులు మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
- Advertisement -



