Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొంపల్లి ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డికి ఘన సన్మానం

కొంపల్లి ఉపసర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
ఇటీవల జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికలలో కొంపల్లి ఉపసర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వెదిరె విజేందర్ రెడ్డి ని బుధవారం తమ నివాసం వద్ద తోటి స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. కొంపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే గొప్ప లక్ష్యంతో గత కొంతకాలంగా వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే దృడ సంకల్పంతో పాఠశాల లో చేసిన సేవలకు కొంపల్లి ప్రజలు  అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజాసేవకు పట్టం కట్టినందుకు కొంపెల్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సన్మానించినవారు  వీరమల్ల కృష్ణయ్య , శ్రీను , పాలకూరి శేఖర్ , దొంతగోని శ్రీను తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -