నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు పట్టణ కేంద్రానికి చెందిన మునగాల యాదగిరి ఆచార్యులు జ్యోతిషంలో డాక్టర్ పొందిన సందర్భంగా సోమవారం మునుగోడు మూడో వార్డు సభ్యులు పందుల ప్రియాంక లింగస్వామి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రియాంక లింగస్వామి మాట్లాడుతూ .. పంచాంగ సిద్ధాంతి,జ్యోతిషులు మునగాల యాదగిరి ఆచార్యులు ఈ నెల 14న మధురైలో జ్యోతిష యోగ శాస్త్ర విశ్వవిద్యాలయం ఫ్లోరిడా ద్వారా జ్యోతిష పరిశోధనలో డాక్టరేట్ పట్టా పొందడం హర్షణీయమని అన్నారు.
నక్షత్ర నాడీ సిద్ధాంతం మీనా2 పద్ధతిలో జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఎలాంటి గ్రహ స్థితి వలన పొందుతారనే విషయంపై ప్రో.డా.శరవన్ కుమార్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. జ్యోతిష యోగ శాస్త్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రో.డా.ఎన్ వి.ఆర్ రాజా ,సి.ఇ.ఓ ప్రో.డా హైమావతి పలువురు జ్యోతిష శాస్త్ర పరిశోధకుల సమక్షంలో మునగాల యాదగిరి ఆచార్యులు డాక్టరేట్ పట్టా అందుకోవడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలోనాగశేఖర్, రేవెల్లి సైదులు, పామనుగుళ్ళ నవీన్ కుమార్ , మునగాల సీతయ్య, పందుల సురేష్ తదితరులు ఉన్నారు.



