Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహనీయులకు ఘనంగా నివాళి

మహనీయులకు ఘనంగా నివాళి

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేర్ : స్వతంత్ర భారతదేశ మాజీ తొలి మహిళా ప్రధాని  ఇందిరా గాంధీ  వర్ధంతి, ఉక్కుమనిషి భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్  జయంతి వేడుకలు పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చౌరస్తాలో మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు చేశారని  ఇందిరాగాంధీ నీ కొనియాడారు. ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్  భారత దేశంలో ఉన్నటువంటి ఎన్నో సంస్థానాలను దేశంలో కలిపిన మహోన్నత వ్యక్తి అని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని రజాకార్ల చర నుండి విముక్తి కలిగించడంలో తన పాత్ర ఎలలేనిదని ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -