Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందల్ వాయి సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం..

ఇందల్ వాయి సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామ సర్పంచిగా ఎన్నికైన లోకాని గంగామణి గంగారం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లను మంగళవారం గ్రామంలోని పలు యూత్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి సన్మానించారు. రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వీరు ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లోకని గంగామణి గంగారం మాట్లాడుతూ.. మాపై నమ్మకం ఉంచి గ్రామం ప్రజలు గెలిపించాలని వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామన్నారు. ఓట్లు వేసి గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సంఘ సభ్యులు, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -