Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నగుల్లా సర్పంచ్ కు ఘన సన్మానం

చిన్నగుల్లా సర్పంచ్ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని చిన్నగుల్లా గ్రామ సర్పంచ్ ను సప్త నిర్వాహకులు గురువారం ఘనంగా సన్మానించారు. కట్టాలి  గ్రామం శివారులో నూతనంగా నిర్మించిన గుడి వద్ద గ్రామస్తుల ఆధ్వర్యంలో సప్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన్న గుల్లా సర్పంచ్ జ్ఞానేశ్వర్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు.

సప్త కార్యక్రమం ఏడు రోజులపాటు జరుగుతుంది. భక్తి భావనలతో భక్తులు భారీ ఎత్తున పాల్గొంటారు. గాత పూజా, పోతీ పూజలు కూడా జరుగుతాయి. ఏ గ్రామంలోనైనా సప్త కార్యక్రమం నిర్వహిస్తే చుట్టుపక్కల గ్రామాల వార్ కార్మికులు, భక్తులు, మాల్ కార్ లు, వీణ వాయిద్యాలతో హజరవుతారు. భక్తిశ్రద్ధలతో ప్రవచనాలు వినడం ఇక్కడి సాంప్రదాయంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండలంలోని పలు గ్రామాల భక్తులు పాల్గొన్నారు. అనంతరం మహా అన్నదాన ప్రసాదం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -